Trending News
Homeఅభివృద్ధివిశాఖ కీర్తి కిరీటంలో కలికితురాయి గ్లోబల్ టెక్ సమ్మిట్

విశాఖ కీర్తి కిరీటంలో కలికితురాయి గ్లోబల్ టెక్ సమ్మిట్

విశాఖ కీర్తి కిరీటంలో కలికితురాయి గ్లోబల్ టెక్ సమ్మిట్

విశాఖ కీర్తి కిరీటంలో కలికితురాయి గ్లోబల్ టెక్ సమ్మిట్ జరగనుంది. విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారింది. మెట్రో నగరం విశాఖ ఇప్పుడు సమ్మిట్లు, కాన్ఫరెన్స్ లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

గ్లోబల్ టెక్ సదస్సులో వెయ్యి మంది వరకు ప్రతినిధులు, జి-20 దేశాలతో పాటు మరో 25 దేశాలకు చెందిన 300 మంది. ప్రతినిధులు, 300 వరకు ఐటీ కంపెనీలు పాల్గొన్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధ తులను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎలా అనుసరించాలి, వ్యవసాయ ఉత్పత్తులను ఎలా ఎగుమతి చెయ్యాలి, అవసరమైన నాణ్యతా ప్రమా ణాలు తదితరాలపై చర్చ జరిగింది. యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయనున్నారని, వ్యవసాయ పద్ధతులపై ఇక్కడి వారికి అవగాహన కల్పించారు. తొలిరోజు సదస్సులో భారత్ డిజిటల్ కాన్సెప్ట్స్, ఫార్మా రంగంలో ప్రజలకు సులభంగా, తక్కువ ధరకు మందులు లభించ డానికి, ఫార్మా ఎడ్యుకేషన్ రంగంలో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందనే అంశాలపై చర్చ జరిగింది. ఈ సదస్సులో మం త్రులు , గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, సీదిరి అప్పలరాజు, పీడిక రాజన్నదొర, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ తదితరు లు పాల్గొన్నారు

ఈ ఈవెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల నాయకులు, ఆవిష్కర్తలు, నిపుణుల కలయిక. , వారు తాజా సాంకేతిక పురోగతులపై వారి జ్ఞానం, పరిశీలనలను పంచుకుంటారు. ఎన్నో కొత్త ఆలోచనలను రేకెత్తించే చర్చలు, ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లతో పాటుగా నెట్‌వర్కింగ్ అవకాశాలను కలిగి కార్యక్రమాలు జరిగాయి.

G20 గ్లోబల్ టెక్ సమ్మిట్ అనేది 20 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ యొక్క ఫోరమ్, అంతర్జాతీయ సాంకేతికత అభివృద్ధి మరియు వ్యాపారాన్ని ప్రోత్సహించే ప్రాథమిక లక్ష్యం. G20 దేశాలలో సమ్మిట్ సిరీస్ షెడ్యూల్ చేయబడింది మరియు ఇది నాయకులకు వేదికగా పనిచేస్తుంది

అంతర్జాతీయ సాంకేతిక విధానాలను చర్చించడం మరియు సమన్వయం చేయడం. గ్లోబల్ టెక్ సమ్మిట్ వాణిజ్యం, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా ప్రపంచ ఆర్థిక సమస్యలపై సహకారం కోసం ఒక వేదికను అందించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమానికి 25 దేశాల నుండి సుమారు 1,000 మంది ప్రతినిధుల బృందం హాజరై ప్రాంగణం మొత్తం ప్రతినిధులతో కళకళలాడింది.

Share With:
Rate This Article
No Comments

Leave A Comment